Wednesday, June 25, 2008

మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు-ఒక సమీక్ష



జిళ్ళేళ్ళమూడి అమ్మ గా పిలువబడి లక్షలాది జనుల భక్తి, ప్రేమలను చూరగొన్న మాత్రుశ్రీ అనసూయాదేవి (౧౯౨౩-౧౯౮౫) దివ్య చరిత్రే ఈ మాతృశ్రీ జీవిత మహోడది లో తరంగాలు........అమ్మ స్వయం గా చెపుతుంటే విని రాయబడినది గా చెప్తారు.......ఆమె పుట్టుక ఘట్టం తో మొదలయిన ఈ గ్రంధం ,ప్రస్తుతానికి, ఆమె కి దాదాపు పదేళ్ళు వోచ్చినంత వరుకే ,...మూడు భాగాలు గా ప్రచురింప బడి ఉన్నది.......అంతే కాక ౧౯౬౨ ఫిబ్రవరి నుండి జీవితాంతం అహర్నిశం డైరీ కూడా రాయబడింది.....బహుశ ఇంత విస్త్రితమయిన చరిత్ర ఈ నాటి ఆధునిక కాలాల లోనే వీలవుతుంది అనుకోవచ్చు........ఇదివరలో ఏ మహనీయుల చరిథ్రలూ ఇంత వివరం గా అక్షరబద్ధం అయినట్లు గా తోచదు.....మిగతా భాగాలు కూడా చాలా వరుకు రాయబద్దాయిగానీ , కొన్ని కారణాల వల్ల ప్రచురిమ్పబడలేదు.......ఆ విషయానికి తరువాత ఒద్దాము...............................................................................
.గ్రంధ రచయితగా రహి అని ముద్రిమ్పబడి ఉంటుంది.....ఇది రచయిత కలం పేరు........అసలయిన రహి తొలి రోజుల్లో అమ్మ కు ఎంతో ప్రియమయిన బిడ్డ........అమ్మ కోసం ఆయన ప్రాణాలే అర్పించినవారని చెప్పుకుంటారు.....ఆమెకు ఎంతో ఇష్టమయిన ఆ పేరు ధరించి రాసిన వారు భాస్కర్ అన్నయ్య అని అంటారు........ఈ పుస్తకం రాయాలన్న ప్రతిపాదనలేమీ లేక ముందే ఒకానొక సమయం లో అమ్మ " నా చరిత్ర పామరుడైన పండితుడు రాయడు.....పండితుడైన పామరుడు రాస్తాడు " అన్నాడట......ఇందులోని శ్లేష గమనార్హం.....తరిచి చూస్తే చాలా అర్తాలున్నాయి ఆ మాటలో................................................
.రచయిత భాస్కర్ అన్నయ్య గుంటూరు జిల్లా లోని ఒక చిన్న పల్లెటూళ్ళో , రైతు కుటుంబం లో పుట్టి, వ్యవసాయం చూసుకునే వ్యక్తి..........పెద్దగ ఆధునిక విద్యలు గానీ, శాస్త్ర వైదుష్యం గానీ నేర్చినవారు కారు.......అయినా అమ్మ ఆయన్నే తన చరిత్రకర్త గా ఎన్నుకున్నది........ఎంతగా విసిగిపోయిందో.....పామరులయిన పండితులతో.............................................................
.పుస్తకం ఆమూలాగ్రం చక్కటి, తీపి తెలుగులో రాయబడి ఉన్నది........అతి గ్రాన్దీకం కనిపించదు......రాసినాయన భక్తుడు.....అయినా ఒక మూడో వ్యక్తి లానే, నిష్పక్షపాతం గా రాయటానికి...(మహాత్యాలుగా అనిపించే వాటినీ, కనిపించేవాటినీ కూడ)....ప్రయత్నించారు........ఒక్కొక్క చోట అది కుదరక ఆయన పారవశ్యం లో మునిగితే తప్పు గ్రంథకర్త ది కాడు ..........భర్త ది .............................................

పుస్తకం పేరు......అద్దినట్టుగా అతికింది.......అమ్మ జీవితాని మహోడది తో పోల్చారు.......అంటే,...ఒక బంగాలాఖాతమో,....అరేబియా సముద్రమో....కాడు........మహోడది......మహా సముద్రం.......రాసినవి,....రాయగాలిగినవి కేవలం కొన్ని తరంగాలే.........మొత్తం లోతులు ఎవరూ చూసినవి కావు.....ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు.........జీవించిన అరవై మూడేళ్లలో, కొన్ని లక్షల మంది దాకా అమ్మ ను చూడగలిగారు.....ఇంకొన్ని లక్షలమంది ఆమెను గురించి వినగాలిగారు....వీరిలో అనేకులు అమ్మ తో ప్రత్యక్షం గాను, పరోక్షం గా కూడా అనుభవాలు అనేకం సంవత్సరాల కొద్దీ పొంది ఉన్నారు.......వాటిలో బయటికి ఒచ్చినవి కొన్ని ఐతే, రానివి ఇంకా అనేకాలు ఉన్నాయి...,...............................................
ఈ మహోడది లో చాలా ప్రవాహాలే కలిశాయి..........గంగా, గోదావరీ,......కృష్ణా, కావేరి,........మనం, , ఎ ఒక్క ప్రవాహం వెంతో , వెళ్లి, మొత్తం అదేనని భ్రమించే ప్రమాదమూ ఉంది......తన జీవితం లో అమ్మ చాలసమస్యలతోనే తల పడవలసి ఒచ్చింది......కులం,....మతం,...జాతి, వర్ణం లాంటివేన్నో విషయాలు ఆమెను బాధించినాయి......"నాల్గు పడగల హైందవ నాగరాజు "అమ్మ తో ఆడుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.......అట్లాగని, అమ్మ చరిత్ర అంతా ఒక సాంఘిక సమరమో, ఇంకోటో కాడు........అది కూడా సంగమించిన ఒక నది........మాత్రమే........అట్లాగే,..ఒక ఆడమనిషి గా (దళితుల్లో దళితులు) అమ్మ అనుభవించినవి చదివి ఫెమినిస్టు కోణం లో అమ్మ ను చూసే అవకాశమూ ఉంది..............................................
అన్నిటి కన్నా ముఖ్యమయినది, పెద్దది-----గంగే అయి ఉంటుంది----అమ్మ నిర్వచించిన నూత్న వేదాంతం.......కొత్త ఆధ్యాత్మికం......కొత్త తాత్విక చింతనం.....కొత్తా.......అంటే.....కోత్తదేమీ కాడు.........ఆది నించీ ఉన్నదే........మైలపడి గుర్తు పట్టలేకుండా అయిపొయింది ..........ఈ ప్రవాహాలన్నీ కలిసినది కనుకనే మహోదదిలో తరంగాలు అయ్యింది.....................................
.కావ్యమందురు కొందరు అంటూ మహా భారతం గురించి ఒక వర్ణన ఉంది.....కొందరికి కావ్యమ్గా, కొందరికి ధర్మ శాస్త్రం గా, కొందరికి రాజనీతి గా, కొందరికి ఇతిహాసం గా,మరి కొందరికి పుక్కిటి పురాణం గా భారతం అనిపించినట్లే మహోదదిలో కూడా అన్ని విషయాలూ ఉన్నాయి..........ధర్మమూ ఉంది, ...తథ్వమూ ఉంది ,....కమ్మని కవిత్వమూ ఉంది,.....చరిత్రా ఉంది,.....భారతం అంత పట్టున్న కథా ఉంది............................................
.అట్లాగే చదివే వాళ్ల ని బట్టీ కూడా అభిప్రాయాలు.....మారచ్చు........నమ్మకం ఉన్నవాళ్లకు మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించేంత నచ్చుతుంది......(పారాయణ అంటే ఇదేనేమో )........అమ్మ మీద ముందుగానే వేరే అభిప్రాయం ఏర్పరుచుకున్న వాళ్ళకు వేరే విధంగా అనిపించ ఒచ్చు........ వాళ్ళని ఓడిలేద్దాము......ముందుగ అమ్మ గురిచి తెలియని, కొత్తగా చదివే వాళ్ళకు,...తాత్విక చింతన వాళ్ళకూ , ఆసక్తిగా, విలక్షణం గా అనిపిస్తుంది.....అనటానికి సందేహం లేదు......ఎందుకంటే నేను కూడా దాదాపు అదే స్థితి లో ఈ పుస్తకం చదివాను..................................
.అట్లాగే ముందుగా ఒక హెచ్చరిక.......ఇది ఒక మహానీయురాలి చరిత్ర,...తత్వవేత్త అయిన ఒక మహిళా కథ అని గుర్తుంచుకోవాలి......ఎందుకంటే, మొదటగా అమ్మ నమ్మశక్యం గా అనిపించదు...... ఒక చిన్న పిల్లెమిటి?.... ఆ పిల్లకి ఇంత ఆలోచనేమిటి అనే అనిపిస్తుంది......ఒక రకమయిన రుచి కలిగిన వ్యక్తులు చిన్నప్పటి నుండీ కూడా అదే తత్వం కలిగి ఉంటారని మనం అర్ధం చేసుకోగలిగితే సమస్య ఉండదు......ఆర్తుర్ కాటన్ దొర చిన్నతనం నుంచే రొట్టెలతోబ్రిద్జేలూ,, కాలువలు కదుతూ ఉండేవాదుట .......పరమహంస పిల్లదిగానే తీవ్ర భక్తి లో మునిగి ఉండేవారుత...........ఒక్కో బిడ్డ లో ఒక్కో ప్రత్యేకత.....అనుకుంటే ఆశ్చర్యం లేదు........................................
ముందు చెప్పినట్లు, ప్రస్తుతం వెలువడ్డ మూడు భాగాల్లో దాదాపు అమ్మ కు పదేళ్ళు ఒచ్చెంత వరుకు కథ జరిగింది......గొలుసుకట్టు గా కాకపోయినా ఆ తరువాత జరిగిన కొన్ని కొన్ని ఘటనలు, చిన్న చిన్న పుస్తకాలుగా అచ్చయ్యాయి......ఎంతో రమ్యమయినవి, ...కొన్ని చాలా బాదాకరమయిన సన్గతులూ జరిగినాయి......కానీ పూర్తి చరిత్ర ఇంకా ప్రచురణ కాలేదు................................
చదివే ముందు ఆనాటి దేశ కాల, మాన పరిస్థితులు ఎట్ల ఉన్నాయో తెలుసుకోవటం ఉపయోగపడుతుంది.......ఎటువంటి అమానుష పరిస్తితులలో క్రీస్తు సిలువవేయబద్దాడో,.......రామ జన్మ ఎంతటి రాక్షస వాతావరణం లో జరిగిందో,.......ఎటువంటి ప్రపంచాన్ని బుద్ధుడు ఒదిలి వెళ్ళాడో................................
.అప్పటి.......అమ్మ చిన్నతనం నాటి రోజులు నిజానికి సాంఘికంగా....ఒక రకమయిన సంధి యుగాలు అని చెప్పొచ్చు......జ్యోతిష్యం లో ఒక మహాదశ నించి ఇంకో మహా దశ కి మారుతున్న చ్చిద్ర దశ అన్తూ ఉంటారు......ఆ రొజులూ అంతే.......ఒక పక్క బస్తీలలో, స్వాతన్త్ర్యోద్యమాలూ ,....కాలేజీ చదువులూ , ...కొత్తగా మొదలయిన త్రైన్లూ బస్సులూ,....రాజకీయ కోలాహలాలూ, ...అప్పుడే ఒస్తున్న సినిమాలూ ఉన్నాయి......ఇంకో పక్క,.......మరీ ఎక్కువగా పల్లెటూళ్ళల్లో ఇంకో విధమయిన వాతావరణమూ ఉంది..... పెద్దగా పంటలు పండేవి కావు......చాలా మంది దగ్గిర డబ్బులు ఆడేవి కావు......పొలాలు, పుట్రలు ఎన్ని ఎకరాలున్నా ధర పలికేవి కావు.......జనం లో మూడు వొంతులున్న బీదా, బిక్కీ పండగ పూట కూడా తెల్లని వరి అన్నం తిని ఎరగరు.....(మంత్రాయి)........మాయ రోగాలతో, రోష్టులతో మనిషి ప్రాణానికి భరోసా ఉండేది కాడు........సరి అయిన వైద్యమూ దొరికేది కాడు........అమ్మ పుట్టిన యేడాది లో ఆమె తల్లి దండ్రులు నలుగురు బిడ్డలను (అంతకు ముందు పుట్టినవారు).... కోల్పోయారు........ఒక్క రాత్రిలో భర్తని, ముగ్గురు బిడ్డలను మశూచికి పోగొట్టుకున్న దీనురాళ్ళున్నారు...(హనుమాయమ్మగారు)........................
ఆడవాళ్ళ పరిస్థితి గురించి చెప్పనక్కర లేదు.......ఆ రోజుల్లోనే, సరోజినీ దేవి, విజయలక్ష్మి పండిట్, తల్యారఖాన్ వంటి పేరు మోసిన వనితలూ ఉన్నారు.......వాళ్లు ఒక శాతం ఉంటే, మిగతా వాళ్ళంతా కాపురాలు చేసుకుంటూ,(ఎవరి అదృష్టం బట్టి వారూ)...,.గంపెడు పిల్లలతో..(అదీ ఎవరి కి వారి అడురుష్టమే ),......మధ్య మధ్య గర్భస్రావాలతో, వాటి నించి ఒచ్చే రోగాలతో, ...నమ్మే నమ్మలేని మొగుల్లతో ,ఎడతెగని కట్టుబాట్ల మధ్య రోజులు గడిపేవాళ్ళు... ....ఒక పక్కన విపరీత ధోరణి కి దిగిన ఆచారాలతో, ఇంకో పక్క మారుతున్న దేశ, కాల, మాన పరిస్థితులతో బ్రాహ్మణ్యం గతి తప్పింది....
............
ఈ నేపధ్యం లో ఒ కుగ్రామం లో కరణం గారింట పుట్టి, ....ఒకటిన్నర సంవత్సరాల వయసు లోనే తల్లిని పోగొట్టుకున్న,......బలహీనంగా కనిపించే,........బక్కపలచాటి,....,..... భూమికి జానేదంతా ,....పెద్ద కళ్ళ,........గొంతే లేవని ....."అమ్మ లేని అనసూయ "....అమ్మ గా ఎట్లా ఎదిగిందో చెప్పే అందమయిన కథే ...మహోడది లో తరంగాలు................
...................................చదివేవారి స్ధాయి ని బట్టి కూడా అవగాహన మారవచ్చు........కొత్తవాళ్ళకు ఒక రకంగా,.....తెలిసినవాళ్ళకు, ప్రాజ్నులకూ, ఇంకా వివరంగా,................స్దూలానికి ఒక విధంగా,........సూక్ష్మార్తాలు ఇంకో విధంగా ,rahasyaardhaalu imkaa విశదంగా..........అనేక వ్యాఖ్యానాలు ఉండవచ్చు.........ఐతే......ఎన్ని రామాయనాలున్న మూలం వాల్మీకిరాముడే.......అమ్మ గురించి ఎందరు ఎన్ని పుస్తకాలు ,వ్యాసాలూ రాసినా,.....ఎందరు ఎన్ని విధాలుగా ఆమెను గ్రహించగాలిగినా......ప్రమాణం మాత్రం ఈ మహోదదిలో తరంగాలే................................
.ఒక్కొక్క చోట కొన్ని కొన్ని వరుసలు అర్ధం కాకపోవచ్చు.......ఇక్కడ అమ్మ తండ్రిగారిని ,తాతయ్య అనీ,......అన్నగారిని మామయ్యా అనీ .......ఇవన్ని మనం అమ్మ బిడ్డలుగా, అప్పుడు వారూ మనకి అయ్యే వరుసలలో రాసినవి .....................
ఒక్కొక్క చోట ...(చాలా తక్కువగానే)....సంభాషణలు,-----తాత్వికమయినవి ----అంత వివరం గా అర్ధం కాకపోవచ్చు.......సామాన్యులు కొంచెం కష్టపడాలి అర్ధం చేసుకోవటానికి........అందులో రచయిత తప్పు ఏమీ లేదు......అంతు పట్టలేని అద్భుత తత్వాని అమ్మ ద్రాక్షారసం లోనే చెప్పినా సామాన్యులమయిన మనకు అది నారికేళ పాకమే.... ....................

మహాత్ముల, ...యోగుల చరిత్రలు చదివే రుచి కలిగినవాళ్ళకు తప్పక చదివితీరవలసిన పుస్తకం......ఆధ్యాత్మిక చింతనాసక్తి కలిగిన వాళ్ళను ఆనందపరుస్తుంది.........ఆ రోజుల్లోకి ఒక సారి తొంగి చూదాలనుకున్న వాళ్ళకూ తప్పక చదవవలసినదే.....ఇంక నమ్మిన వాళ్ళకు ఎంత తృప్తినిస్తుందో చెప్పనక్కర లేదు.........అమ్మ చెప్పినట్లు..............తృప్తే ముక్తి కదా?.....